Page Loader
BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ 
క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ

BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సంస్థ బిగ్‌బాస్కెట్‌ ఇప్పుడు తన సేవలను మరింత విస్తరిస్తోంది. తాజా చర్యగా ఇది క్విక్‌ ఫుడ్‌ డెలివరీ రంగంలోకి అడుగుపెడుతోంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 10 నిమిషాల వ్యవధిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ సేవలు టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మరియు స్టార్‌బక్స్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టార్‌బక్స్‌తో పాటు, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHCL)కు చెందిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ 'క్యూమిన్‌' (Qmin) ద్వారా అందించనున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కాఫీ, టీ, జ్యూస్‌, స్నాక్స్‌, మీల్‌ బౌల్స్‌, డెసర్ట్స్‌ వంటి వస్తువులు బిగ్‌బాస్కెట్‌ క్విక్‌ ద్వారా వినియోగదారులకు వేగంగా చేరనున్నాయి.

Details

IHCL సంస్థ ప్రారంభించిన ఆహార డెలివరీ యాప్‌

క్యూమిన్‌ అనేది టాటా సన్స్‌ యాజమాన్యంలో ఉన్న IHCL సంస్థ ప్రారంభించిన ఆహార డెలివరీ యాప్‌. టాటా హోటళ్లు, రెస్టారెంట్లలో తయారయ్యే ప్రీమియం ఫుడ్‌ను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకునే విధంగా ఈ సేవను 2020లో ప్రారంభించారు. అంతేకాకుండా, బేకరీ ఉత్పత్తుల కోసం 'క్యూమిన్‌ కేఫ్‌'ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ క్విక్‌ డెలివరీ విభాగంలో ఇప్పటికే జెప్టో (Zepto Cafe), స్విగ్గీ (Swiggy Snacks), బ్లింకిట్‌ (Blinkit Bistro) వంటి ప్రధాన ఆటగాళ్లు తమ సేవల్ని విస్తరిస్తున్నారు.

Details

డిమాండ్ ను బట్టి భారీగా పెట్టుబడులు

10 నిమిషాల్లో ఆహారాన్ని వినియోగదారులకు చేరవేస్తూ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను గమనించి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్లింకిట్‌ బిస్ట్రో ఇప్పటికే దిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో 100కు పైగా కిచెన్‌లను నిర్వహిస్తోంది. ఇలాంటి పటిష్టమైన పోటీ మధ్య బిగ్‌బాస్కెట్‌ ప్రారంభించిన ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ తమ ఖాతాదారులకు మరింత సౌకర్యాన్ని అందించడంతో పాటు, టాటా గ్రూప్‌ డిజిటల్‌ కన్స్యూమర్‌ వ్యాపార విభాగాన్ని మరింత బలోపేతం చేయనుంది.