
WeWork:దివాళా తీసిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీ.. రూ. 4 లక్షల కోట్లు అప్పులు.. కోర్టులో పిటిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్(Wework) దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
ఒకప్పుడు దాదాపు 47 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో రికార్డు సృష్టించిన ఆ సంస్థ ఇవాళ అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
చాలా కంపెనీలకు ఈ కంపెనీనే స్ఫూర్తిగా నిలవగా, తాజాగా ఆ కంపెనీనే దివాలా తీసింది.
న్యూజెర్సీ ఫెడరల్ కోర్టుకు సమర్పించిన ఫైలింగ్ కంపెనీ లైబటిటీస్ అంటే చెల్లించాల్సిన బాధ్యతలు దాదాపు 10 నుంచి 50 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది.
2010లో ప్రారంభమైన ఈ సంస్థ 2023 జూన్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 700 చోట్ల కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఆఫీస్ వర్క్‌లో విప్లవాత్మక మార్పులను వివర్క్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Details
వర్క్ ఫ్రమ్ విధానంతో మూతపడ్డ ఆఫీసులు
తమ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని, ప్రపంచ శ్రేణి ఉద్యోగుల బృందం కంపెనీకి మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఈవో డేవిడ్ టోల్లే పేర్కొన్నారు.
ఇక న్యూజెర్సీ కోర్టులో దాఖలు చేసిన దివాలా పిటిషన్ ఆధారంగా ఈ కంపెనీ చెల్లింపులు చేయాల్సిన మొత్తం 10 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు తెలిసింది.
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కంపెనీ బిలియన్ డాలర్ల వరకు నష్టం చవిచూసింది.
ఆడమ్ నిర్ణయాలు, పనితీరు కారణంగా కంపెనీ వేగంగా వార్తల్లోకెక్కింది.
ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తితో వర్కఫ్రమ్ హోం విధానం మొదలై చాలా ఆఫీసులు మూతపడ్డాయి.