LOADING...
Microsoft: బిల్ గేట్స్ సంచలన నిర్ణయం.. ఫౌండేషన్ మూసివేత, ఉద్యోగాల సంఖ్య తగ్గింపే లక్ష్యం!

Microsoft: బిల్ గేట్స్ సంచలన నిర్ణయం.. ఫౌండేషన్ మూసివేత, ఉద్యోగాల సంఖ్య తగ్గింపే లక్ష్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిల్ గేట్స్‌ తన ప్రతిష్ఠాత్మక సేవా సంస్థ 'బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్'‌ను క్రమంగా ముగించేందుకు తొలి అధికారిక చర్యలు ప్రారంభించారు. వచ్చే దశాబ్దాల్లో సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలనే నిర్ణయానికి అనుగుణంగా, 2026 సంవత్సరానికి గాను 9బిలియన్ డాలర్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. అలాగే సంస్థ మూసివేత దిశగా ప్రయాణంలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కూడా దశలవారీగా తగ్గించే ప్రణాళికను ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దాతృసంస్థలలో ఒకటైన గేట్స్ ఫౌండేషన్‌ను 2045నాటికి పూర్తిగా మూసివేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, విద్య వంటి రంగాల్లో భారీ స్థాయిలో నిధులు వెచ్చించిన ఈ సంస్థకు ఇది కీలక మలుపుగా మారింది.

Details

2026కు 9 బిలియన్ డాలర్ల బడ్జెట్

ప్రస్తుతం ప్రారంభమైన తొలి దశలో, ఒకవైపు కార్యక్రమాలపై రికార్డు స్థాయిలో ఖర్చు పెంచుతూ, మరోవైపు పరిపాలనా వ్యయాలు, సిబ్బంది నియామకాలపై కఠిన నియంత్రణలు అమలు చేయనున్నారు. 2026 సంవత్సరానికి ఆమోదించిన 9 బిలియన్ డాలర్ల బడ్జెట్ గేట్స్ ఫౌండేషన్ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఖర్చుగా నిలవనుంది. ప్రపంచ ఆరోగ్యం, పేదరిక తగ్గింపు, విద్య వంటి కీలక రంగాల్లో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ అదనపు నిధులు కేటాయించినట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పలు దేశాల్లో అంతర్జాతీయ సహాయ నిధులు తగ్గుతున్న నేపథ్యంలో, ఈ ఖర్చులు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొంది.

Advertisement