Page Loader
మొరాకో భూకంప బాధితులకు బినాన్స్ అండ.. 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ 
3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ

మొరాకో భూకంప బాధితులకు బినాన్స్ అండ.. 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొరాకో భూకంప బాధితుల కోసం బినాన్స్ అండగా నిలిచింది. ఈ మేరకు క్రిప్టో కర్సెన్సీలో 3 మిలియన్ డాలర్ల ఎయిర్‌డ్రాప్ చేస్తున్నట్లు బినాన్స్ ప్రకటించింది. మొరాకోలో ఇటీవలే సంభవించిన భూకంపం కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో నివసించే బినాన్స్ వినియోగదారులకు BNBలో 3 డాలర్ల మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 25 కోట్లు) ఎయిర్‌డ్రాప్ చేసేందుకు బినాన్స్ ఛారిటీ ప్రణాళికలు నేటి నుంచి అమలు చేస్తోంది. విపత్తు బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం క్రిప్టోకరెన్సీ బదిలీల వేగం, తక్కువ ధర, పారదర్శకత వంటి వాటిని సరిహద్దులతో సంబంధం లేకుండా అందించనున్నట్లు తెలిపింది. మొరాకోలోని సుమారు 70 వేల మంది బినాన్స్ వినియోగదారులు సహాయక చర్యల నుంచి ప్రయోజనం పొందనున్నారని అంచనా వేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మొరాకో బాధితులపై 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న బినాన్స్ ఛారిటీ