LOADING...
మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?
మార్కెట్‌పై ప్రయోజనాన్ని అందించే నాలుగు క్రిప్టోకరెన్సీలు

మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 22, 2022
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022 క్రిప్టో కరెన్సీకు పెద్దగా కలిసిరాలేదు, కాకపోతే క్రిప్టో చరిత్రలో నిలిచిపోయే LUNA క్రాష్, FTX పతనం పాటు మార్కెట్లో అనేక ఇతర నష్టాలు సంభవించాయి. అయితే సరైన నిర్ణయాలతో లాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి. బుల్ మార్కెట్‌లో పనిచేసిన వ్యూహాలు ఈ మార్కెట్‌లో లాభాలను ఆర్జించడంలో సహాయపడవు, అందుకే మీకోసం మార్కెట్‌పై ప్రయోజనాన్ని అందించే నాలుగు క్రిప్టోకరెన్సీల వివరాలు క్రిందన ఉన్నాయి చదవండి. Ethereum (ETH): మార్కెట్‌లో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. ఈ కరెన్సీకి ఉన్న విలువకు మాత్రమే కాకుండా, ఇతర కాయిన్‌ల కంటే డబ్బును ఉంచడానికి ఇది చాలా సురక్షితం.మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా కొన్ని ETH టోకెన్‌లు ఉండటం వలన లాభం ఉంటుంది.

క్రిప్టో కరెన్సీ

అధిక రాబడిని ఇచ్చే Big Eyes Coin

Binance Coin (BNB) మూడవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ. అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ సృష్టి. FTX క్రాష్ తర్వాత క్రాస్‌ఫైర్‌లో చిక్కుకున్నప్పటికీ BNB తట్టుకుని నిలబడింది. ApeCoin (APE): APE పర్యావరణ వ్యవస్థ కోసం యుటిలిటీ, గవర్నెన్స్ టోకెన్‌గా పనిచేయడానికి యుగా ల్యాబ్స్ రూపొందించిన Ethereum-ఆధారిత క్రిప్టోకరెన్సీ. ప్రస్తుతం మార్కెట్‌లో ఆశాజనకంగా ఉన్న క్రిప్టో కరెన్సీలలో ఒకటి. Big Eyes Coin(BIC): బిగ్ ఐస్ కాయిన్(BIC)తో మార్కెట్‌లోని ఇతర మీమీకాయిన్‌ల కంటే మెరుగైన స్థితిలో ఉండచ్చు. హోల్డర్‌లు తమ డబ్బుపై అధిక రాబడిని పొందడానికి ఈ కరెన్సీ సరైన ధరలో ఉన్నట్లు కనిపిస్తోంది. మార్కెట్‌పై ప్రయోజనాన్ని అందించడానికి ఇప్పుడు ప్రీసేల్‌లో చేరడం మంచిది.