LOADING...
The Paradise : 'ప్యారడైజ్'లో మరో సర్‌ప్రైజ్ రోల్‌.. ప్రేక్షకులకు షాక్‌ ఇవ్వనున్న కీలక పాత్ర!
'ప్యారడైజ్'లో మరో సర్‌ప్రైజ్ రోల్‌.. ప్రేక్షకులకు షాక్‌ ఇవ్వనున్న కీలక పాత్ర!

The Paradise : 'ప్యారడైజ్'లో మరో సర్‌ప్రైజ్ రోల్‌.. ప్రేక్షకులకు షాక్‌ ఇవ్వనున్న కీలక పాత్ర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 'దసరా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సినిమా, 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో నాని 'జడల్' (Jadal)అనే మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌తో స్పష్టమైంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో మెరవనున్నారు.

Details

మార్చి 26న రిలీజ్

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్రలో (విలన్‌గా) కనిపించబోతున్నారనే సమాచారం.

Details

ప్రతి నాయకుడి పాత్రలో తనికెళ్ల భరణి

కెరీర్ ప్రారంభ దశలో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భరణి, చాలా కాలం తర్వాత మళ్లీ అటువంటి పదునైన ప్రతినాయక పాత్రలో నటించటం విశేషంగా భావిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని, ముఖ్యంగా నానితో ఆయన తలపడే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని ఆసక్తికర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement