Page Loader
Bitcoin: డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం.. $89,000 దాటిన బిట్‌కాయిన్ 
డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం.. $89,000 దాటిన బిట్‌కాయిన్

Bitcoin: డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం.. $89,000 దాటిన బిట్‌కాయిన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో, క్రిప్టోకరెన్సీ, ముఖ్యంగా బిట్‌ కాయిన్‌ (Bitcoin), చరిత్రలోనే అత్యధికమైన విలువను నమోదు చేస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలు క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ఉండొచ్చని అంచనాలతో, బిట్‌కాయిన్‌ విలువ రికార్డు స్థాయిలో పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో, బిట్‌కాయిన్‌ విలువ 90వేల డాలర్లకు చేరువైంది, ఇది చరిత్రలోనే తొలిసారి. అమెరికాను క్రిప్టోకరెన్సీ రాజధానిగా మార్చాలని, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో, బిట్‌కాయిన్‌ ర్యాలీ (Bitcoin Rally) మరింత వేగం పొందింది. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో, బిట్‌కాయిన్‌ విలువ 89,637 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.75 లక్షలు) వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది.

వివరాలు 

30శాతంపెరిగిన బిట్‌కాయిన్‌ విలువ

ఈ ఉత్సాహం కొనసాగితే, ఈ ఏడాది చివరికి బిట్‌కాయిన్‌ విలువ లక్ష డాలర్లను దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ (US Next President Trump) అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, బిట్‌కాయిన్‌ విలువ 30శాతంతో పైగా పెరిగింది. అగ్రరాజ్యంలో వడ్డీరేట్లు మరింత తగ్గే సంకేతాలు కూడా ఈ ర్యాలీని బలోపేతం చేస్తున్నాయి.