Bitcoin Price: బిట్‌కాయిన్ ధరలో భారీ మార్పు.. 74,500 డాలర్ల దిగువన ట్రేడింగ్
ఈ వార్తాకథనం ఏంటి
క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో మరోసారి ఒడిదుడుకులు మొదలయ్యాయి. నవంబర్ 10న ప్రారంభ ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ ధర 75,231 డాలర్ల వరకు దూసుకెళ్లింది. కానీ ఆ లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే ధర 74,443 డాలర్లకు చేరి 24 గంటల వ్యవధిలో 0.71 శాతం నష్టపోయింది. వారం రోజుల లెక్కలో చూస్తే బిట్‌కాయిన్ దాదాపు 2.86 శాతం తగ్గింది. అమెరికా టెక్, ఏఐ కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడంతో క్రిప్టో మార్కెట్‌లోనూ ఎన్నికల తర్వాత వచ్చిన లాభాలు కొంతవరకు తుడిచిపెట్టుకుపోయాయి.
Details
74,300-74,800 డాలర్లు కీలకం
ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు 74,300 నుంచి 74,800 డాలర్ల ప్రాంతం కీలక సపోర్ట్‌గా మారింది.
ఈ స్థాయి నిలబడితే ధరలో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
WazirX వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి ప్రకారం, ఈ సపోర్ట్ జోన్ తర్వాత 73,100-73,300 డాలర్ల ప్రాంతం మరో ముఖ్యమైన స్థాయిగా కనిపిస్తోంది.
పైవైపు 76,300-76,500 డాలర్ల ప్రాంతం ప్రధాన రెసిస్టెన్స్‌గా ఉంది. ఈ స్థాయిని దాటితే బిట్‌కాయిన్‌లో కొనుగోళ్ల ఉత్సాహం పెరగవచ్చు.
Details
ETFల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ
బిట్‌కాయిన్ ETFల నుంచి 412 మిలియన్ డాలర్ల నికర నిధులు బయటకు వెళ్లాయి.
అదే సమయంలో Ethereum ETFల నుంచి మరో 93.19 మిలియన్ డాలర్లు ఉపసంహరించుకున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ ఔట్‌ఫ్లోలు క్రిప్టో ధరలపై ఒత్తిడి పెంచుతాయి.
అయితే కీలక ధర స్థాయుల్లో బిట్‌కాయిన్ నిలబడటం కొంత ఊరటనిస్తోంది.
స్పాట్ కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్, డెరివేటివ్స్ మార్కెట్ పొజిషనింగ్ వంటి అంశాలు సంస్థాగత అమ్మకాలను తాత్కాలికంగా సమతుల్యం చేస్తున్నాయని నిశ్చల్ శెట్టి పేర్కొన్నారు.
Details
అమెరికా ద్రవ్యోల్బణ డేటాపైనే తదుపరి చూపు
ఇప్పుడు క్రిప్టో ఇన్వెస్టర్ల దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై పడింది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు వెలువడే ఈ డేటా బిట్‌కాయిన్ తదుపరి కదలికను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
గియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ ప్రకారం, నెలవారీ కోర్ ద్రవ్యోల్బణం 0.2 శాతం అంచనాను మించి వస్తే డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బలపడవచ్చు.
అప్పుడు 76,450 డాలర్ల స్థాయిని దాటడం బిట్‌కాయిన్‌కు మరింత కష్టంగా మారొచ్చు. దీంతో ప్రస్తుతం క్రిప్టో మార్కెట్‌లో ధర కంటే అమెరికా ఆర్థిక డేటానే పెద్ద ట్రిగ్గర్‌గా మారింది.