Page Loader
Blinkit: బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్‌ 
బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్‌

Blinkit: బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్ (Blinkit) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 నిమిషాల్లోనే డెలివరీలు అందిస్తున్న ఈ సంస్థ, తాజాగా రిటర్న్లు, ఎక్స్ఛేంజ్‌ సదుపాయాలను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు కూడా కేవలం 10 నిమిషాల్లోనే అందించబడతాయని సంస్థ తెలిపింది. బ్లింకిట్‌లో ఈజీ రిటర్నుల గురించి కంపెనీ సీఈఓ అల్బిందర్‌ దిండ్సా 'ఎక్స్' వేదికగా వివరించారు.

వివరాలు 

దిల్లీలో ఈ సేవల పరీక్ష

"దుస్తులు, పాదరక్షలు కొనుగోలు చేసిన తర్వాత ఫిట్టింగ్‌ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు లేదా నచ్చకపోతే రిటర్న్‌ చేయాలనుకుంటారు. ఈ కష్టాలను తొలగించేందుకు బ్లింకిట్‌లో రిటర్న్‌, ఎక్స్ఛేంజ్‌ సదుపాయాలు అందించాం. కేవలం 10 నిమిషాల్లోనే ఈ సేవలు అందిస్తాం" అని దిండ్సా ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. సంబంధిత స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు.కొన్ని వారాలుగా ఈ సేవలను దిల్లీలో పరీక్షించినట్లు ఆయన తెలిపారు. దిల్లీ టెస్ట్‌ డ్రైవ్‌ విజయవంతంగా కొనసాగినందువల్ల ముంబయి, దిల్లీ, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నామని బ్లింకిట్‌ వెల్లడించింది. రిటర్నులు, ఎక్స్ఛేంజ్‌లను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్బిందర్ ధిండా చేసిన ట్వీట్