LOADING...
Blinkit: 10 నిమిషాల్లో కళ్లజోడ్లు..లెన్స్‌కార్ట్‌తో చేతులు కలిపిన బ్లింకిట్
10 నిమిషాల్లో కళ్లజోడ్లు..లెన్స్‌కార్ట్‌తో చేతులు కలిపిన బ్లింకిట్

Blinkit: 10 నిమిషాల్లో కళ్లజోడ్లు..లెన్స్‌కార్ట్‌తో చేతులు కలిపిన బ్లింకిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్‌ కామర్స్‌ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తమ సేవలను క్రమంగా మరింత విస్తరిస్తున్నాయి. మొదట్లో వీటి కార్యకలాపాలు కేవలం గ్రోసరీ సరుకులకే పరిమితం అయ్యాయి. అనంతరం స్మార్ట్‌ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటి గ్యాడ్జెట్లను కూడా 10 నిమిషాల వ్యవధిలో కస్టమర్లకు చేరవేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ పోటీలో మరో అడుగు ముందుకేసింది జొమాటోకు చెందిన క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ బ్లింకిట్. ఇకపై కళ్లజోడ్లను కూడా పది నిమిషాల్లో డెలివరీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఈ కొత్త సర్వీసు కోసం బ్లింకిట్‌ ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుంది.

వివరాలు 

ఈ సేవలు ప్రధాన నగరాల్లో ప్రారంభం 

బ్లింకిట్‌ యాప్‌లో వినియోగదారులు తమ పవర్‌ ఆప్షన్లను (-0.25, -0.5, -0.75, -1.0, -1.5) నుంచి ఎంచుకోవచ్చు. అలాగే, ఇష్టమైన కలర్‌ ఫ్రేమ్‌ను ఎంపిక చేసిన వెంటనే ప్రిస్క్రిప్షన్‌ అవసరం లేకుండానే కేవలం పది నిమిషాల్లో కళ్లజోళ్ళను అందిస్తామని దిండ్సా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వేగవంతమైన సేవలు దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్బీందర్‌ దిండ్సా చేసిన ట్వీట్