Boeing layoffs: బోయింగ్ భారీగా ఉద్యోగుల తొలగింపులు.. 17 వేల మందిపై ఎఫెక్ట్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 17,000 మంది సిబ్బందిని తొలగించనున్నది. ఈ పరిణామం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఉద్యోగులను పింక్ స్లిప్పులు ఇచ్చి, వారికి 60 రోజుల నోటీసు పీరియడ్ ప్రకటించింది. ఈ 60 రోజుల కాలంలో వారు జనవరి వరకు తమ విధుల్లో కొనసాగుతారు.
మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతం
బోయింగ్ సంస్థ గత కొన్ని కాలంగా భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతం తగ్గించడం వంటి నిర్ణయాన్ని తీసుకోవాలని సంస్థ ముందే ప్రకటించింది. ఇప్పటి పరిస్థితులలో ఈ చర్యలు అత్యవసరమైనవి అని బోయింగ్ అభిప్రాయపడింది. ఆర్థికంగా ముడిపడి ఉన్న పరిస్థితుల్లో, సంస్థ కీలకమైన వ్యాపార అంశాలపై మాత్రమే దృష్టి సారించేందుకు నిర్ణయించుకుంది. తాము ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో, సంస్థ తన ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని ప్రకటించింది.