Loading...
Oil Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల జోరు.. మళ్లీ 95 డాలర్ల పైకి
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల జోరు.. మళ్లీ 95 డాలర్ల పైకి

Oil Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల జోరు.. మళ్లీ 95 డాలర్ల పైకి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రామాణికంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్లను దాటింది. గత ఆరు వారాల తర్వాత ఈ స్థాయిని చేరడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రెంట్ క్రూడ్‌తో పాటు అమెరికా ప్రమాణమైన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) ముడి చమురు ధర కూడా పెరిగి బ్యారెల్‌కు 88 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో మరోసారి అనిశ్చితి నెలకొంది.

వివరాలు 

ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు

ఇదిలా ఉండగా,ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతుండగా, ప్రతిగా ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది.

ఈ పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

మరోవైపు, యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు సంబంధించిన నౌకలను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

వివరాలు 

ముడి చమురు రవాణాకు అంతరాయం

దీంతో చమురు ట్యాంకర్లు భద్రతా కారణాల దృష్ట్యా తమ ప్రయాణ మార్గాలను మార్చుకుంటున్నాయి.

ఫలితంగా పశ్చిమాసియా నుంచి ముడి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ భయాలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి.

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లలోనూ ప్రతికూల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలను చవిచూశాయి.

ADVERTISEMENT