Loading...
Oil prices: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. 90 డాలర్లు దాటిన బ్రెంట్ చమురు ధర!
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. 90 డాలర్లు దాటిన బ్రెంట్ చమురు ధర!

Oil prices: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. 90 డాలర్లు దాటిన బ్రెంట్ చమురు ధర!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చమురు మార్కెట్‌లో సోమవారం భారీ ఒత్తిడి కనిపించింది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమవడంతో పాటు,హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 3 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్క్‌ను దాటి 90.79డాలర్లకు చేరుకుంది. గత వారం దాదాపు 15.9శాతం పెరిగిన బ్రెంట్ ధరలు ఇదే ఊపును కొనసాగించాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర కూడా 2.65శాతం పెరిగి బ్యారెల్‌కు 84.68డాలర్లకు చేరుకుంది. గత వారం ఈ సూచీ కూడా 15.5శాతం లాభపడింది. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి.

వివరాలు 

తొమ్మిదో రోజు కూడా ఇరాన్‌పై దాడులు

వారాంతంలో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

అమెరికా వరుసగా తొమ్మిదో రోజు కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించగా, అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్‌లపై కూడా ఇరాన్ దాడులు జరిగినట్లు సమాచారం వెలువడింది.

ఇటీవలి రోజులుగా రెండు దేశాలు సముద్ర మార్గాల్లో రవాణాపై దృష్టి సారించాయి.

ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నామని అమెరికా ప్రకటించగా, హోర్ముజ్ జలసంధిలో తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరాన్ తెలిపింది.

ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే సాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.

వివరాలు 

ఒమాన్‌లోని కుమ్జార్ ప్రాంతానికి వాయువ్య దిశలో నౌకలో మంటలు

ఒమాన్‌లోని కుమ్జార్ ప్రాంతానికి వాయువ్య దిశలో ఒక నౌకలో మంటలు చెలరేగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ వెల్లడించింది.

ఈ ఘటన కూడా సముద్ర రవాణాపై ఆందోళనలను మరింత పెంచింది.

ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులు ఎంత మేర కొనసాగుతాయనే అంశం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని బార్క్లేస్ విశ్లేషకుడు అమర్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

యుద్ధం ప్రారంభమైన సమయంలోతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ చమురు నిల్వలు గత ఐదేళ్లలోనే అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయని, అందువల్ల సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆదివారం హోర్ముజ్ జలసంధి గుండా నాలుగు నౌకలు

ఎల్‌ఎస్‌ఈజీ గణాంకాల ప్రకారం ఆదివారం హోర్ముజ్ జలసంధి గుండా కేవలం నాలుగు నౌకలు మాత్రమే ప్రయాణించాయి.

అంతకుముందు రోజు ఈ సంఖ్య ఎనిమిది ఉండగా, రవాణా గణనీయంగా తగ్గింది.

అయితే శుక్రవారం నుంచి కనీసం మూడు చమురు ఉత్పత్తుల ట్యాంకర్లు, ఒక భారీ క్రూడ్ ఆయిల్ క్యారియర్ హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించి చమురు లోడింగ్‌కు సిద్ధమైనట్లు సమాచారం.

ADVERTISEMENT