Page Loader
Brian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్‌ వేతనం
టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్‌ వేతనం

Brian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్‌ వేతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్, తన మొదటి నాలుగు నెలల వేతనంగా 96 మిలియన్ డాలర్లను (సుమారు రూ.827 కోట్లు) పొందారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది. ఇది అమెరికాలో కార్పొరేట్ సీఈఓలకు అందించే అత్యధిక వేతన ప్యాకేజీలలో ఒకటిగా నిలిచింది. టెక్ దిగ్గజాలు, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంటే నికోల్‌ ప్యాకేజీ ఎక్కువ. గతేడాది సెప్టెంబర్‌లో స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నికోల్, కంపెనీకి చేరిన వెంటనే 5 మిలియన్ డాలర్ల సైన్-ఆన్ బోనస్‌ను అందుకున్నారు. ఈ మొత్తంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల రూపంలో అందుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.

Details

113 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం

ఈ మేరకు నికోల్‌ను నియమించినప్పుడు ఆయనకు 113 మిలియన్ డాలర్ల వార్షిక వేతన ప్యాకేజీ అందించినట్లు అంచనా వేసింది. స్టార్‌బక్స్‌లో అమ్మకాలు క్షీణించినప్పుడు, ఆ సమయంలో సీఈఓగా ఉన్న భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను తొలగించి, నికోల్‌ను నియమించారు. ప్రస్తుతం నికోల్ తాత్కాలిక గృహ ఖర్చులను భరించడానికి, కంపెనీ జెట్‌ను ఉపయోగించేందుకు ఆంగీకరించారు. సీటెల్‌లోని కంపెనీ కార్యాలయానికి తన దక్షిణ కాలిఫోర్నియా ఇంటి నుంచి ప్రయాణించేందుకు 72,000 డాలర్లు, అలాగే ఇతర వ్యక్తిగత ఖర్చులకు 19,000 డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం.