Page Loader
Income Tax: వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త

Income Tax: వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్నును రూ.12 లక్షల వరకు మినహాయిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలిపి, రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా గా ఉంటుంది అని ఆమె తెలిపారు. రూ.18 లక్షల వరకు ఆదాయం పొందే వ్యక్తులకు రూ.70 వేల వరకు లాభం ఉంటుందని చెప్పారు. అలాగే, రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షల వరకు లాభం చేకూరనున్నట్లు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్థిక శాఖ చేసిన ట్వీట్ 

వివరాలు 

తాజా ఆదాయపు పన్ను స్లాబ్‌లు

రూ. 0-4 లక్షలు - నిల్ రూ. 4-8 లక్షలు- 5% రూ 8-12- 10% రూ 12-16- 15% రూ 16-20-20% రూ 20-24- 25% రూ. 24 లక్షల పైన- 30%