Union Budget 2026: గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రసూతి, శిశు సంరక్షణకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కేవలం ఆసుపత్రుల విస్తరణకే కాకుండా తల్లీబిడ్డల ఆరోగ్య ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే డాక్టర్ 'కృష్ణ ప్రసాద్ వున్నం' అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది వైద్య రంగానికి, వైద్య విద్యకు కేటాయించిన నిధులు పెరుగుదల సాధించిన విషయం శుభపరిణామంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సారి మరింత స్పష్టమైన, క్షేత్రస్థాయి ఫోకస్ ఉన్న ప్రణాళిక అవసరం ఉన్నట్లు ఆయన అన్నారు.
Details
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు
డాక్టర్ కృష్ణ ప్రసాద్ బలంగా సూచించినవి ఇవే: ప్రసూతి, నవజాత శిశువుల సంరక్షణ, పీడియాట్రిక్ వైద్యం కోసం గ్రామీణ, మరుసర ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు అవసరం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు పోషకాహార పథకాలు హై-రిస్క్ గర్భధారణ నిర్వహణ నవజాత శిశువుల కోసం ఐసీయూ (NICU) సదుపాయాలు ఈ చర్యలు మరణాల రేటును తగ్గిస్తాయి, కానీ భవిష్యత్ తరాల దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాది వేస్తాయని ఆయన వివరించారు.
Details
నెట్‌వర్క్ బలోపేతం
చిన్న పట్టణాలు, "టైర్-2, టైర్-3 నగరాల్లో సమయానికి వైద్యం అందేలా డిజిటల్ హెల్త్ సిస్టమ్స్, రిఫరల్ నెట్‌వర్క్‌ల బలోపేతం ముఖ్యం. అలాగే నిపుణులైన వైద్య సిబ్బందిని తయారు చేసేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని డాక్టర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. నిరంతర సంరక్షణ & వ్యాధి నివారణ డాక్టర్ ప్రకారం 'ప్రివెంటివ్ కేర్' నాణ్యమైన ప్రమాణాలు, గర్భధారణ మొదలుకొని శిశువు ఎదుగుదల వరకు నిరంతర సంరక్షణ అందించేలా బడ్జెట్ ఉండాలని ఆకాంక్షించారు. అలా చేసిన పక్షంలో, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది, తద్వారా దేశ వైద్య వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.