Bulls regain control: మార్కెట్‌లో మళ్లీ బుల్స్ ఆధిపత్యం: సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్,నిఫ్టీ 22,900
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం గట్టిగా పుంజుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మధ్యాహ్నానికి బలంగా కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణపై ఆశలు పెరగడం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. మధ్యాహ్నం 2:20 సమయానికి సెన్సెక్స్ దాదాపు 663 పాయింట్లు పెరిగి 73,982 వద్ద, నిఫ్టీ 208 పాయింట్లు లాభంతో 22,921 వద్ద ట్రేడ్ అయింది. ఎక్కువ శాతం రంగాల సూచీలు గ్రీన్‌లో ఉండగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ మాత్రమే బలహీనంగా కనిపించాయి.
వివరాలు
2 శాతం పెరిగిన
చిన్న, మధ్య తరహా సూచీలు కూడా 1 శాతం పైగా లాభపడ్డాయి. ట్రెంట్, టైటాన్, అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గరిష్టంగా 7 శాతం వరకు ఎగబాకగా, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు పడిపోయాయి. రూపాయి డాలర్‌తో పోలిస్తే 33 పైసలు బలపడటం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం, ఐటీ షేర్లలో సానుకూల అంచనాలు కూడా మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు 2 శాతం వరకు పెరగడం గమనార్హం. అయితే నిఫ్టీ కీలక స్థాయిలకు దిగువకు వెళితే మరింత పతనం అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.