
Cage Fight : ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు.. కుబేరుల కేజ్ ఫైట్ లేనట్లే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్య కాలంలో కేజ్ ఫైట్ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య దీనిపై గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది.
వీరి మధ్య నిజంగానే ఫైట్ ఉంటుందని అంతా భావించారు. దీనికి వారి మాటలే నిదర్శనం. ప్రస్తుతం అదంతా ఉత్తిదే అని తేలిపోయింది.
ఇది జోక్ అని మస్కే స్వయంగా నెట్టింట్లో స్పందించడం విశేసం. ఫైట్ రికాప్ అంటూ ఇప్పటివరకూ జరిగిన వ్యవహారాన్ని మాస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఈ ఫైట్ గురించి తాను జుకర్ బర్గ్ తో జోక్ చేశానని, తమ పోటీ కోసం వేదిక ఇచ్చేందుకు ఇటలీ ముందుకొచ్చిందని, కానీ జుక్ తిరస్కరించారని మస్క్ పేర్కొన్నారు.
Details
కేజ్ ఫైట్ అంతా జోక్ అనేలా మస్క్ పోస్టు
ఇటీవల కాలంలో మస్క్, జుకర్ బర్గ్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విసయం తెలిసిందే. గత నెలలో ట్విట్టర్ పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్ ఫైట్‌కు సిద్ధమని తొలుత మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దీనిపై జుకర్ బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అంటూ సమాధానమిచ్చాడు. ఈ కేజ్ ఫైట్ కోసం ఇద్దరు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది.
వీరిద్దరూ ఫైట్ కోసం సాధన కోసం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ క్రమంలో ఈ ఫైట్ అంతా జోక్ అనేలా మస్క్ పోస్టు పెట్టడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు
Fight Recap:
— Elon Musk (@elonmusk) August 15, 2023
I joked on X about fighting Zuck
Zuck then said “SEND ME LOCATION”
Italy graciously offered a Colosseum
Zuck declined
I suggested his home as “safe space”
Tragically, he was ahem “traveling”
Is there anywhere he will fight?
https://t.co/gpcRLW49fv