Right to disconnect: పనివేళల తర్వాత ఉద్యోగులకు రిలాక్స్...కాలిఫోర్నియా అసెంబ్లీలో బిల్
వృత్తిగతానికి, వ్యక్తిగతానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకునేందుకు ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తోంది. పనివేళల తర్వాత ఉద్యోగికి, సంస్థకు మధ్య ఎటువంటి వేధింపులు లేకుండా వారికి కాస్త రిలాక్సేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ ''రైట్ టు డిస్ కనెక్ట్" బిల్ ను అసెంబ్లీలో పెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా ఉద్యోగి సంస్థకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటాన్నినిరోధిస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు 'ది శాన్ఫ్రాన్సిస్ కో స్టాండర్డ్ ' కథనాన్ని ప్రచురించింది.
ఉద్యోగి హక్కులను పరిరక్షించే విధంగా బిల్లు
ఈ బిల్లు ప్రకారం నాన్ వర్కింగ్ అవర్స్ లో సంస్థకు సంబంధించిన పనుల సమాచారాన్ని ఇచ్చేందుకు గానీ,పనిని చేసేందుకు గానీ సంస్థకు ఎటువంటి హక్కులుండవు. ఇది ఉద్యోగి హక్కులను పరిరక్షించే విధంగా బిల్లు రూపొందించబడింది.ఈ బిల్లు అమలు బాధ్యతను లేబర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఈ బిల్లు సరిగ్గా అమలు అవుతుందా లేదాని పర్యవేక్షిస్తుంది. ఒకవేళ్ల బిల్లును ఉల్లంఘించి ఉద్యోగికి నాన్ వర్కింగ్ అవర్స్ లో గాని పనిచెప్పడం,లేదా పని గురించి సమాచారాన్ని అడగడం చేస్తే సదరు కంపెనీ లేదా సంస్థకు 8,340 రూపాయల జరిమానాను విధిస్తుంది. ఈ బిల్లు గనుక పూర్తి స్థాయిలో వాస్తవ రూప దాలిస్తే ఫ్రాన్స్, అర్జెంటీనా, ఐర్లాండ్ వంటి దేశాలు ఈ విధానాన్ని అనుసరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.