'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 26వరకు పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. బడ్జెట్ క్యారియర్‌తో పాటు ఇతర కారణాల వల్ల 26 మే 2023 వరకు విమానాలను రద్దు చేసినట్లు గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. తక్షణ పరిష్కారం, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం కంపెనీ ఒక దరఖాస్తును దాఖలు చేసిందని, త్వరలోనే బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.
మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా అభిలాష్ లాల్ నియామకం
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) మే 10న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ స్వచ్ఛంద అభ్యర్ధన దివాలా పరిష్కార ప్రక్రియను అంగీకరించింది. క్యారియర్ వ్యవహారాలను నిర్వహించడానికి మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్‌పీ)గా అభిలాష్ లాల్‌ను నియమించారు. ఎన్‌సీఎల్‌టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది లీజర్లు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) కోసం క్లెయిమ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ 'gofirstclaims.in/claims' ప్రారంభించింది.