Bank holiday: మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
మార్చి 31న బ్యాంకు సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైనందున, అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు అదే రోజున నమోదయ్యేలా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండగా, ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం ఆదాయం, చెల్లింపులు పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.
దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆగకుండా ఉండేందుకు RBI ఈ నిర్ణయం తీసుకుంది.
Details
లావాదేవీలను వేగంగా పూర్తి చేయాలి
ఇది ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ప్రభుత్వ పన్నుల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు, ప్రభుత్వ సబ్సిడీల ట్రాన్సాక్షన్లకు, జీతభత్యాలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నిరంతరంగా పనిచేసి, ప్రభుత్వానికి అవసరమైన లావాదేవీలను వేగంగా పూర్తిచేయడానికి తోడ్పడుతుంది.