LOADING...
Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు
అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు

Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మరోసారి కష్టాలు మబ్బుల్లా కమ్ముకున్నాయి. బ్యాంక్‌ మోసం కేసులో భాగంగా ఆయనకు చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలపై, అలాగే ఇతర ప్రాంతాల్లోనూ సీబీఐ శనివారం విస్తృత సోదాలు నిర్వహించిందని అధికారులు వెల్లడించారు. అనిల్ అంబానీ గ్రూప్‌ సంస్థలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే ఈడీ (ED) ఆయన కార్యాలయాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

Details

10 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

అంతేకాక రెండు వారాల క్రితం అనిల్ అంబానీని సుమారు 10 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. అనంతరం మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఈ తాజా సీబీఐ చర్యతో అంబానీకి ఎదురయ్యే ఇబ్బందులు మరింత పెరిగినట్లయ్యాయి.