Page Loader
Hydro Projects: 13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక
13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక

Hydro Projects: 13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఇటీవల 2024-25 సంవత్సరానికి సంబంధించిన 6 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (PSPs) సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఆమోదించింది. మొత్తం 7.50 గిగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, ఈ విభాగంలో ప్రైవేట్ రంగం నుండి ఆసక్తికరమైన భాగస్వామ్యం కనిపిస్తోంది. తద్వారా హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ రంగం మరింత అభివృద్ధి చెందుతున్నట్టు స్పష్టమవుతోంది.

Details

నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక

మరోవైపు 2025-26లో మొత్తం 22 గిగావాట్ల సామర్థ్యం గల 13 కొత్త PSP ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ ఫ్రణాళిక సిద్ధం చేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులలో చాలా వరకు నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా, 2030 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తిగా ప్రారంభమవాలని అంచనా వేస్తున్నారు. ఇలా ప్రైవేట్ రంగం ప్రోత్సాహంతో కూడిన ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో శక్తి నిల్వల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.