NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు
    తదుపరి వార్తా కథనం
    కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు
    కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు

    కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 23, 2023
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సిమెంట్‌ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో దేశీయ సిమెంట్‌ కంపెనీలు 3 శాతం మేర ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ ఓ నివేదిక రిలీజ్ చేసింది.

    డిమాండ్‌ ఆరోగ్యకరంగానే ఉన్నా కంపెనీల మధ్య పోటీ పెరిగి, ముడివ్యయాలు తగ్గిన కారణంగా రిటైల్‌ ధర దిగుతుందని వెల్లడించింది.

    గత సంవత్సరంలో 50 కేజీల సిమెంట్‌ బస్తా రూ. 391 గరిష్ఠస్థాయిని తాకింది.

    కరోనా సమయంలో ఏర్పడ్డ సరఫరా అవాంతరాలు, బొగ్గు ధరలు ఎక్కువ కావడంతో సిమెంట్‌ ధర అమాంతం పెరిగింది.

    ప్రస్తుతం కంపెనీలు మార్కెట్‌ లో తమ వాటాను పెంచుకునేందుకే మొగ్గుచూపుతున్నందున ఈ ఏడాది సిమెంట్‌ ధర తగ్గనుంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఒక శాతం మేర తగ్గించాయి.

    DETAILS

    పెట్‌-కోక్‌ ధర ఇంకా దిగివస్తుంది : క్రిసిల్‌

    7 ఏళ్లలో మొదటిసారిగా వర్షాకాలం ముందు ఏప్రిల్‌, మేలో సిమెంట్‌ ధరలు పెరుగుతుంటాయి. కానీ కంపెనీల పోటీతో ఫస్ట్ టైమ్ ఏప్రిల్‌, మే నెలల్లో ధరలు పెరగలేదని క్రిసిల్‌ డైరెక్టర్‌ హితాల్‌ గాంధీ వెల్లడించారు.

    గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధరలు 2 శాతం మేర తగ్గి బస్తా రూ. 382 నుంచి రూ. 285కి దిగివస్తుందన్నారు.

    సిమెంట్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు ధరలు తగ్గడం ఆయా కంపెనీలకు కలిసి వస్తుందని క్రిసిల్‌ స్పష్టం చేశారు.

    మరోవైపు క్రూడ్‌ ధరకు అనుగుణంగా అంతర్జాతీయంగా పెట్‌-కోక్‌ ధర 13 శాతం పడిపోయిందని వివరించారు.

    ముడి చమురు శుద్దితో ఉత్పత్తి చేసే పెట్‌-కోక్‌ ధర ఇంకా దిగివస్తుందని తాము భావిస్తున్నామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025