NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    సొమ్ముపై వడ్డీ రేటు ఖరారు

    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 24, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఖాతాల్లో ఉండే సొమ్ముపై వడ్డీ రేటు ఖారారైంది. ఆర్థిక సంవత్సరం(2022-23)కి సంబంధించి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కేంద్రం 8.15 శాతంగా నిర్ణయించింది.

    గతేడాదితో పోలిస్తే ఈపీఎఫ్ఓ తాజా వడ్డీ రేటు 0.05 శాతం ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం మేర వడ్డీ రేటు ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు సదరు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

    మార్చి 28, 2023న డిపాజిట్లపై వడ్డీ రేటును రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ(EPFO) 8.15 శాతనికి పెంచింది.

    DETAILS

    వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్న ఈపీఎఫ్ఓ

    ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ కేంద్ర ఆర్థిక శాఖకు పంపించింది. అక్కడ ఆమోదం లభించడంతో సోమవారం కీలక ప్రకటనను వెలువరించింది.

    ఈ నేపథ్యంలో ఆరుకోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. త్వరలోనే ఈపీఎఫ్ఓ 2022-23 వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

    ఈ మేరకు 8.15 శాతం చొప్పున వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ఫీల్డ్ కార్యాలయాలు ప్రారంభించనున్నాయి.

    ఈపీఎఫ్ఓ 2021-22 వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 4 దశాబ్దాల కనిష్టం 8.10 శాతానికి మార్చి 2022లో తగ్గించింది. 1977-78లో వడ్డీ రేటు 8 శాతంగా ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025