పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్ ను తప్పనిసరి చేసింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మూడు పథకాలున్నాయి.
1. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్,
2. పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్),
3. ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌లు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో ఈడీఎల్‌ఐ పథకానికి సంబంధించి కీలక మార్పులను సూచించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులు చనిపోతే సదరు ఉద్యోగి సూచించిన నామినీకి 7 లక్షల రూపాయల మేర ప్రయోజనాల్ని అందిస్తోంది. ఆయా డబ్బులు పొందాలంటే ఈ- నామినేషన్‌ను సంస్థ తప్పనిసరి చేసింది.
DETAILS
ఏదైనా సంస్థలో ఒక సంవత్సరం పని చేస్తేనే స్కీమ్‌కి అర్హత
ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబీకులకు బీమా రక్షణ ప్రయోజనాల్లో ఈడీఎల్‌ఐ ఒకటని ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ తెలిపింది.
ఈపీఎఫ్ చట్టం 1952 మేరకు లిస్ట్ అయిన అన్నీ కంపెనీలు డిఫాల్ట్‌గా ఈడీఎల్‌ఐలో నమోదు చేసుకుంటాయని పేర్కొంది.
ఈపీఎస్, ఈపీఎఫ్ స్కీమ్‌ల్లో భాగంగా కొంత మొత్తాన్ని ఉద్యోగే చెల్లిస్తారు. కానీ ఈడీఎల్‌ఐలో అలా ఉండదు. ఉద్యోగి తరఫున యాజమాన్యం చెల్లింపులు చేస్తుంది.
అయితే సదరు బెనిఫిట్ పొందాలంటే మాత్రం ఉద్యోగులు ఏదైనా సంస్థలో ఒక సంవత్సరం పని చేస్తేనే స్కీమ్‌కు అర్హత సాధిస్తారు.
ఉద్యోగి అకాల మరణంతో నామినీలు పీఎఫ్, పెన్షన్ విత్ డ్రాయిల్, ఈడీఎల్‌ఐలను తప్పక క్లెయిమ్ చేయాలి.
ప్రక్రియలో భాగంగా వివిధ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.