Page Loader
Aadhar Card: ఆధార్ కార్డు మార్పులకు కొత్త నిబంధనలు.. ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి..
ఆధార్ కార్డు మార్పులకు కొత్త నిబంధనలు.. ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి..

Aadhar Card: ఆధార్ కార్డు మార్పులకు కొత్త నిబంధనలు.. ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీరు కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫోటో వంటి వివరాలను సరిచేయాలనుకుంటున్నారా? అయితే, తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)విడుదల చేసిన 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ఆధార్ అప్‌డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ ప్రకటించింది. ఒకే వ్యక్తి పేరుతో పొరపాటున రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు జారీ అయితే, వాటిలో మొదట జారీ చేసిన ఆధార్ నంబర్ మాత్రమే చట్టబద్ధంగా సరైనదిగా పరిగణించబడుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నెంబర్లు రద్దవుతాయి.

వివరాలు 

ఈ నాలుగు ప్రధాన డాక్యుమెంట్లు అవసరం

కొత్తగా ఆధార్ అప్డేట్ చేయాలంటే కింద తెలిపిన నాలుగు ప్రధాన డాక్యుమెంట్లు అవసరం: 1. గుర్తింపు ధ్రువీకరణ పత్రం (Identity Proof) ఈ కేటగిరీలో మీరు క్రింది పత్రాలను అందించవచ్చు: పాస్‌పోర్ట్, పాన్ కార్డు (చెల్లుబాటు అయ్యే ఇ-పాన్ కార్డు), ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, నరేగా జాబ్ కార్డు, పెన్షనర్ ఐడి కార్డు, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కార్డు (CGHS/ESM హెల్త్ స్కీమ్ కార్డు), ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కార్డు

వివరాలు 

2. చిరునామా ధ్రువీకరణ పత్రం (Address Proof)

ఈ కేటగిరీలో కింది డాక్యుమెంట్లను చిరునామా ధ్రువీకరణ కోసం చూపించవచ్చు: విద్యుత్, నీటి, గ్యాస్, లేదా ల్యాండ్‌లైన్ బిల్లు (3 నెలల లోపు) బ్యాంక్ పాస్‌బుక్ లేదా స్టేట్‌మెంట్ రేషన్ కార్డు పాస్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం పెన్షన్ డాక్యుమెంట్ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం

వివరాలు 

3. పుట్టిన తేదీకి సంబంధిత పత్రం (Date of Birth Proof) 

ఈ దశలో మీరు కింది పత్రాల్లో ఏదైనా అందించవచ్చు: స్కూల్ మార్క్ షీట్ పాస్‌పోర్ట్ పుట్టిన తేదీ ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ పుట్టిన తేదీతో కూడిన రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ 4. సంబంధానికి రుజువు (అవసరమైతే) బంధాన్ని నిరూపించాల్సిన సందర్భాల్లో సంబంధిత ధృవీకరణ పత్రం తప్పనిసరి.

వివరాలు 

ఎవరి కోసం ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి? 

ఈ మార్గదర్శకాలు భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు),ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు, దీర్ఘకాలిక వీసాతో భారతదేశంలో ఉంటున్న విదేశీయులపై వర్తిస్తాయి. వీరంతా సంబంధిత ప్రాంతీయ ఆధార్ కార్యాలయాల్లో తమ డాక్యుమెంట్లు చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీఐ కార్డుదారుల విషయంలో, వారు తమ పాస్‌పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్‌ఆర్‌ఆర్ఓ నివాస అనుమతిని చూపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్.. ఉచిత సేవ యూఐడీఏఐ ప్రకారం, జూన్ 14, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని ఉచితంగా అందిస్తోంది. మీ ఆధార్ డిటెయిల్స్‌ను ఇంటి నుంచే సులభంగా సరిచేయవచ్చు.