Coforge: కోఫోర్జ్ షేర్లకు జోష్.. ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చిన జేపీ మోర్గాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. స్టాక్‌కు జేపీ మోర్గాన్ 'ఓవర్‌వెయిట్' రేటింగ్ ఇవ్వడంతో పాటు కంపెనీ కొత్త ఛైర్మన్‌గా అఖిల్ కుమార్ గుప్తాను నియమించడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో కోఫోర్జ్ షేరు 2శాతం పెరిగి రూ.1,813.80 వద్ద ట్రేడైంది. కోఫోర్జ్ షేరుకు జేపీ మోర్గాన్ 'ఓవర్‌వెయిట్' రేటింగ్ ఇచ్చింది. రూ.1,850 టార్గెట్ ధరను నిర్ణయించింది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 4శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. కంపెనీ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అఖిల్ కుమార్ గుప్తాను నియమించినట్లు కోఫోర్జ్ ప్రకటించింది.
వివరాలు
ఐదేళ్ల కాలానికి ఛైర్మన్‌గా అఖిల్ కుమార్ గుప్తా
అలాగే ఆయనను ఛైర్మన్‌గా నియమించింది. ఈ నియామకం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఐదేళ్ల కాలానికి ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
గుప్తా గతంలో భారతి ఎంటర్‌ప్రైజెస్ వైస్‌ఛైర్మన్‌గా పనిచేశారు.
40ఏళ్లకు పైగా వృత్తిపరమైన అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆయన ప్రస్తుతం 360 ONE WAM లిమిటెడ్, భారతి లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థల బోర్డులకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
జప్టో, స్నాప్‌డీల్, యూటెల్‌సాట్ కమ్యూనికేషన్స్, లోధా డెవలపర్స్ సంస్థల బోర్డుల్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు.
కోఫోర్జ్ బోర్డు ఛైర్మన్ పదవిని ఊహించిన దానికంటే ముందుగానే భర్తీ చేయగలిగిందని జేపీ మోర్గాన్ పేర్కొంది.
కంపెనీ నిర్దేశించిన మూడు నెలల వ్యవధిలో మరో బోర్డు సభ్యుడిని కూడా నియమించే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
ఐదేళ్ల కాలానికి ఛైర్మన్‌గా అఖిల్ కుమార్ గుప్తా
ఛైర్మన్ నియామకం పూర్తవడంతో పాటు మరో స్వతంత్ర డైరెక్టర్ నియామకం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక కంపెనీ ప్రధాన పనితీరు, ఏఐ (AI) విభాగంలో పురోగతి, ఎంకోరా (Encora) విలీనం, వచ్చే ఐదేళ్ల లక్ష్యాలపై దృష్టి మళ్లే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ తెలిపింది.