Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
నాస్‌డాక్-లిస్టెడ్ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. పదేపదే రిమైండర్‌ల తర్వాత కూడా ఆఫీసుకు రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు లైవ్‌మింట్ నివేదించింది. ఏప్రిల్ 15న ఉద్యోగులకు లేఖ రాసింది. హెచ్చరికలు జారీ చేసిన ఆఫీసులకు రాని వారిపై నిఘా పెట్టింది. మార్గదర్శకాల్ని లెక్కచేయని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొంది. ఇప్పటికైనా ఆఫీసుకు వస్తే సరే అని లేకపోతే లేఆఫ్స్ చేస్తామని హెచ్చరించింది. "కంపెనీ నియమ నిబంధనలు, పాటించని వారు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడినట్లే పరిగణించాల్సి వస్తుంది. తదనుగుణంగా వారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇది తొలగింపుకు దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో నివేదిక పేర్కొంది.
2,54,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులు భారతదేశంలోనే..
ఫిబ్రవరిలో, వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, IT సంస్థ భారతదేశంలోని తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది. ఈ మేరకు అప్పట్లోనే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక మెమోలో పేర్కొన్నారు. కానీ వీటిని ఉద్యోగులు పెద్దగా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్ లో మొత్తం 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా.. దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉండడం విశేషం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా 2023 చివర్లోనే వారి ఉద్యోగులను .. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. TCS వారానికి ఐదు రోజుల షెడ్యూల్‌ను రూపొందించింది.
మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించిన కాగ్నిజెంట్
ఇక ఇటీవల కాగ్నిజెంట్ ఈ క్యాలెండర్ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించింది. కాగ్నిజెంట్ అట్రిషన్ రేటు 10 శాతం పాయింట్లు తగ్గి 12 నెలల ప్రాతిపదికన 13.1 శాతానికి చేరుకుంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో దీని వినియోగ రేటు 1 శాతం పెరిగి 82 శాతానికి చేరుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (CTS) క్లయింట్లు విచక్షణతో ఖర్చు చేయడం వల్ల ఆదాయంలో సంవత్సరానికి (YoY) 1.1 శాతం పడిపోయి $4.8 బిలియన్లకు చేరుకుంది. ఇతర చాలా ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య ఇదే స్థాయిలో పడిపోయింది.