
పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు.. థ్రెడ్స్‌పై దావా వేస్తాం : ట్విట్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఫేస్ బుక్ మాతృక సంస్థ మెటా తీసుకొచ్చిన కొత్త యాప్ థ్రెడ్స్, ట్విట్టర్‌కు ప్రధాన పోటీదారుగా మారుతోంది. థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
మెటా 'థ్రెడ్స్'యాప్ తమ 'మేథో సంపత్తి హక్కులను' ఉల్లంఘించిందని ట్విట్టర్ ఆరోపణలు చేసింది. దీంతో థ్రెడ్స్ ఫై దావా వేస్తామని ట్విట్టర్ హెచ్చరించింది.
ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌కు ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో లేఖను రాశారు. లేఖలో మెటాపై తీవ్ర ఆరోపణలు చేసిన ట్విట్టర్, తమ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని తెలిపింది.
ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, ఇతర సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది.
Details
ట్విట్టర్ చేసిన ఆరోపణలను ఖండించిన మెటా
ఈ ఘటనపై స్పందించిన ఎలాన్ మస్క్ పోటీ మంచిదే కానీ మోసం చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు. మరోపక్క ట్విట్టర్ చేసిన ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. ట్విట్టర్ లో పనిచేసిన ఉద్యోగులను తాము తీసుకోలేదని స్పష్టం చేసింది.
గురువారం నుంచి థ్రెడ్స్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ట్విట్టర్ తరహా ఫీచర్లతో ఉండే ఈ థ్రెడ్స్ యాప్‌ను ఇన్ స్టాగ్రామ్ అనుసంధానంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా ట్విట్టర్ తో పోలిస్తే థ్రెడ్స్‌లో కొన్ని తేడాలున్నాయి.
ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపు 5 కోట్లకు పైగా యూజర్లను థ్రెడ్స్ యాప్ సొంతం చేసుకొంది.