ట్విట్టర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్.. జూన్ 6న లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మేటా కొత్త యాప్‌ను తీసుకురానుంది. దానికి థ్రెడ్స్(Threads) అని పేరు పెట్టారు. ఈ కొత్త యాప్‌ను జూన్ 6న లాంచ్ చేయనున్నారు.
ఈ యాప్ యాపిల్ స్టోర్‌లో ఫ్రీ ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది డౌన్ లోడ్ చేసుకోగానే ఇన్ స్టాగ్రామ్‌కి కూడా లింక్ అవుతుంది.
థ్రెడ్స్ యాప్ డాష్ బోర్డు చూడటానికి అచ్చం ట్విట్టర్ లాగే ఉంటుంది. ఇది టెక్ట్స్ ఆధారిత చాటింగ్ యాప్ అని ఫేస్‌బుక్ చెబుతోంది.
యూరప్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ సోమవారం దర్శనమిచ్చింది. మరోవైపు ట్విట్టర్ కొత్త నిబంధనలపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్న అడ్వర్టైజర్లకు మేటా థ్రెడ్స్ మంచి ఆప్షన్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Details
థ్రెడ్స్ యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు
ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్, ట్విట్టర్ యజమాని మస్క్ ఇద్దరు ప్రపంచ కుబేరులు. వీరిద్దరూ పోటీపడి మరీ కొత్త యాప్‌లను తీసుకొస్తున్నారు.
ఈ మెటా లాంచ్‌పై ట్విట్టర్‌లో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు థ్రెడ్స్ కోసం ఎదురుచూస్తున్నామని అంటుంటే, ఇంకొందరు మాత్రం ట్విట్టర్‌లోనే ఉంటామని చెబుతన్నారు.
సబ్ స్క్రిప్షన్ ఫీజు, లిమిటేషన్ నిబంధనలతో ట్విట్టర్ యూజర్లను ఇబ్బంది పడుతున్న వేళ, మేటా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
సోషల్ మీడియాలో మెటా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ చేద్దామంటూ ఇటీవల ట్వీట్ చేశారు. దీనికి జూకర్ బర్గ్ స్పందించి లోకేషన్ పంపించు అంటూ ప్రతిసవాల్ విసిరిన విషయం తెలిసిందే.