భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి
సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు లేవనెత్తిన మొత్తం ఫిర్యాదుల్లో సగానికిపైగా పరిష్కరించినట్లు నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత ఫిర్యాదులు ఏప్రిల్‌తో పోలిస్తే మేలో రెండింతలు అంటే 16,995కి పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదులు 68 శాతానికి పైగా పెరిగాయి. కంటెంట్‌లో అశ్లీలత ఉన్నట్లు అందిన ఫిర్యాదుల్లో పదో వంతు తక్కువ వాటిపై చర్యలు తీసుకుంది ఫేస్‌బుక్ యాజమాన్యం
2,325 ఫిర్యాదుల పరిష్కరించడానికి సూచనలు
బెదిరింపు, వేధింపులు, నకిలీ ఫ్రొఫైల్స్‌కు సంబంధించి మొత్తం 16,995 ఫిర్యాదులు అందినట్లు నివేదిక పేర్కొంది. అందులో 2,325 ఫిర్యాదులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి సూచనలను అందించింది. మిగిలిన 14,670 ఫిర్యాదుల్లో 2,299 దరఖాస్తులపై సమీక్ష జరిపి చర్యలు తీసుకున్నారు. ఫేస్‌బుక్ ఏప్రిల్ 2023లో వినియోగదారుల నుంచి స్వీకరించిన 41 శాతం ఫిర్యాదులపై చర్య తీసుకుంది. అలాగే అదే నెలలో ఇన్‌స్టాగ్రామ్ 54 శాతానికి పైగా ఫిర్యాదులపై చర్య తీసుకుంది.