LOADING...
silver: పసిడి ధర పెరగడంతో వెండి కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి
పసిడి ధర పెరగడంతో వెండి కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి

silver: పసిడి ధర పెరగడంతో వెండి కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధనత్రయోదశి సందర్బంగా పసిడి, వెండి కొనుగోళ్లు ఆశాకానికి చేరాయి. పసిడి ధర పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు ఈసారి ఎక్కువగా వెండి వైపు ఆసక్తి చూపారు. గతేడాది ధనత్రయోదశితో పోలిస్తే, వెండి నాణేలు విక్రయాలు 35-40 శాతం పెరిగాయి. విలువ పరంగా కూడా అమ్మకాలు రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ధనత్రయోదశి రోజున పసిడి అమ్మకాలు 15 శాతం తగ్గవచ్చని ఆభరణాల వర్తక సంఘం భావిస్తోంది. ధనత్రయోదశి శనివారం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం వరకు రెండు రోజులపాటు కొనసాగనుంది. అందువల్ల విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Details

ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగే అవకాశం

ఆన్‌లైన్‌ ద్వారా కూడా కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఏడాది పండగలో మొత్తం విక్రయాలు రూ.50,000 కోట్లకు పైగా చేరవచ్చని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్‌ (జీజేసీ) ఛైర్మన్ రాజేశ్‌ రోక్డే పేర్కొన్నారు. ఫలితంగా వెండి నాణేలు, పూజా వస్తువుల అమ్మకాలు 40 శాతం పెరిగాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. హాల్‌మార్క్‌ సర్టిఫికేషన్‌, సులభతర సేవల కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగదారుల విశ్వసనీయతను సంపాదించాయి.

Details

గతేడాది కంటే 25శాతం ఎక్కువ

అమెజాన్‌ ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ ఇండియా డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ భగత్‌ చెబుతున్నట్లుగా, తమ ప్లాట్‌ఫామ్‌లో ఖరీదైన ఆభరణాల విక్రయాలు ఏడాదిక్రితంతో పోలిస్తే 96 శాతం పెరిగాయి. సంక్షిప్తంగా, ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంలో భారత వినియోగదారులు సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేశారని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (కెయిట్‌) అంచనా వేసింది. వీటిలో పసిడి, వెండి కొనుగోళ్లు కేవలం రూ.60,000 కోట్ల వరకు ఉండవచ్చని, ఇది గత ఏడాదిక్రితంతో పోలిస్తే 25 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.