Copper Price: రాగి.. బంగారంకన్నా విలువైన భవిష్యత్ లోహం.. ఇంట్రెస్టింగ్ స్టడీ!
ఈ వార్తాకథనం ఏంటి
భూమిలో లభించే ప్రతి లోహానికీ ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అయితే దాని వినియోగం, అవసరం ఏ రంగంలో ఉందన్నదే దాని బట్టి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో, నిపుణులు చెబుతున్నట్లుగా రాబోయే రోజుల్లో రాగి అత్యంత ప్రాధాన్యత పొందబోతోందని అంచనాలు వెలువడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పత్తి శక్తి (క్లీన్ ఎనర్జీ) రంగాల విస్తరణతో రాగికి భారీ డిమాండ్ ఏర్పడనుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
రాగి - భవిష్యత్తు లోహం
ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో పోలిస్తే రాగి ధర అంతగా ఉండకపోయినా, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుంటే ఇది కీలకమైన లోహంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పత్తి శక్తి, కృత్రిమ మేధస్సు (AI), రక్షణ పరికరాల తయారీ వంటి రంగాల్లో రాగి వినియోగం వేగంగా పెరుగుతోంది. గతంలో,కెనడాకు చెందిన ప్రముఖ మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్ (Barrick Gold) తన పేరులోని "గోల్డ్" అనే పదాన్ని తొలగించి కేవలం "బారిక్"గా మార్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనుల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, రాగి పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
పెట్టుబడుల కోణంలో కూడా రాగి ఆకర్షణీయమే
ఇప్పటివరకు బంగారం, వెండిలోనే పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులు ఇప్పుడు రాగి వైపు దృష్టి సారించవచ్చని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా రాగి వినియోగం వేగంగా పెరుగుతున్నందున అనేక దేశాలు కాపర్ మైనింగ్ రంగంలో అడుగుపెడుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, రాగి కూడా బంగారం, వెండి తరహాలోనే భవిష్యత్తులో ఒక విలువైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.