తదుపరి వార్తా కథనం
Budget 2025: పదేళ్లలో 192% పెరిగిన అప్పు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 02, 2025
09:20 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశపు మొత్తపు అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఇందులో రూ.190,14,852 కోట్లు దేశీయ రుణం, రూ.6,63,920 కోట్లు విదేశీ రుణం ఉండనున్నాయి.
2025 మార్చి 31 నాటికి దేశపు అప్పు రూ.181,74,284.36 కోట్లకు చేరుతుందని అంచనా.
కాగా 2015 మార్చి 31 నాటికి మొత్తం అప్పు రూ.62,22,357.55 కోట్లుగా ఉంది. అంటే గత పది ఏళ్లలో దేశపు అప్పు 192% పెరిగింది.
Details
కేంద్ర ప్రభుత్వ అప్పులు తగ్గుముఖం పడుతున్నాయి
అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అప్పులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు.
జీడీపీలో రుణ నిష్పత్తి క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ (ఆర్థిక లోటు) 4.8%కి తగ్గిందని, 2025-26 నాటికి దాన్ని 4.4%కి తగ్గించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.