Page Loader
Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ
నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ

Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ లో అంతరాయం కారణంగా తమకు $500 మిలియన్ల నష్టం వాటిల్లిందని డెల్టా ఎయిర్ లైన్స్ పేర్కొంది. CNBC స్క్వాక్ బాక్స్‌లో బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో ఆ కంపెనీ సీఈఓ ఎడ్ బాస్టియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 5,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు అయ్యాయని తెలిపారు. 40,000 సర్వర్‌లను మాన్యువల్‌గా రీసెట్ చేయాల్సి ఉందని బాస్టియన్ చెప్పారు.

Details

ఎటువంటి ఆఫర్లు ప్రకటించిన క్రౌడ్ స్టైక్

ఇతర విమానయాన సంస్థలు కూడా క్రౌడ్‌స్ట్రైక్ సమస్య నుండి వేగంగా కోలుకున్నాయి. డెల్టాకు ఆర్థికంగా సహాయం చేయడానికి క్రౌడ్‌స్ట్రైక్ ఇప్పటివరకు ఎటువంటి ఆఫర్‌లు చేయలేదు. క్రౌడ్‌స్ట్రైక్, మైక్రోసాఫ్ట్ రెండింటి నుండి నష్టపరిహారం కోసం డెల్టా ప్రముఖ న్యాయవాది డేవిడ్ బోయిస్‌ను నియమించుకుంది. ఈ నష్టాలపై మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తామని ఎడ్ బాస్టియన్ వెల్లించారు.