Page Loader
ఆన్లైన్ గేమింగ్‌ కంపెనీలకు  DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్‌ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు
ఒక్క డ్రీమ్‌ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు

ఆన్లైన్ గేమింగ్‌ కంపెనీలకు  DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్‌ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 26, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గేమింగ్‌ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది. ఒక్క డ్రీమ్‌ 11 కంపెనీకే రూ.25 వేల కోట్ల పన్ను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు భారతదేశంలోని 12 రియల్‌ మనీ గేమింగ్‌ కంపెనీలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGGI) ముందస్తు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసు అందుకున్న జాబితాలో ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 (Dream 11)తో పాటు పలు కంపెనీలున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం రూ. 55 వేల కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

DETAILS

దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో పన్ను నోటీసులు

మరోవైపు ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీని విధిస్తున్నారు.దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ ఇటీవలే నిర్ణయించిన నేపథ్యంలో దేశంలోని తొలిసారిగా ఈ స్థాయిలో భారీగా పన్ను నోటీసులు పంపించడం ఇదే ప్రథమం. బకాయిలు ఏ మేరకు ఉన్నాయో, ఆయా కంపెనీలకు తెలియజేస్తూ అదాయపు పన్ను శాఖ (IT) షోకాజ్‌ నోటీసులకు ముందు ఈ ప్రీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. డ్రీమ్‌ 11, రమ్మీ సర్కిల్‌, మై 11 లాంటి బడా కంపెనీలు నోటీసులు అందుకున్నాయి.త్వరలోనే మరిన్ని కంపెనీలకు నోటీసులు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. డీజీజీఐ ప్రీ షోకాజ్‌ నోటీసులపై డ్రీమ్‌ 11 బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.గతేడాది బెంగళూరుకు చెందిన గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీకి రూ.21 వేల కోట్ల నోటీసు అందించింది.