LOADING...
Digilogic revenue: డిజిలాజిక్‌ ఆదాయం రూ.78.27 కోట్లు.. లాభాల్లోనూ జోరు
డిజిలాజిక్‌ ఆదాయం రూ.78.27 కోట్లు.. లాభాల్లోనూ జోరు

Digilogic revenue: డిజిలాజిక్‌ ఆదాయం రూ.78.27 కోట్లు.. లాభాల్లోనూ జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు టెస్టింగ్, సిమ్యులేషన్‌ సిస్టమ్స్‌ను అందించే డిజిలాజిక్‌ సిస్టమ్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.78.27 కోట్ల ఆదాయంపై రూ.10.43 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ కంపెనీ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజీలో ఈ ఏడాది జనవరిలో లిస్టింగ్‌ అయ్యింది. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.72.19 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ.7.79 కోట్లుగా నమోదైంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో నుంచి రూ.8 కోట్లను కంపెనీ అప్పుల చెల్లింపులకు వినియోగించింది. 'ప్రాజెక్ట్‌ ఉడాన్‌' కింద హైదరాబాద్‌లో రూ.51.74 కోట్ల పెట్టుబడితో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

వివరాలు

భారత్‌ను రక్షణ తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యం

అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో సేవలను విస్తరించేందుకు 80 శాతం వాటాతో మే 23న అభేధ్య సిస్టమ్స్‌ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రక్షణ రంగం కొత్త దశలోకి ప్రవేశిస్తోందని, అత్యాధునిక ఆవిష్కరణలతో భారత్‌ను రక్షణ తయారీ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ వర్మ జెట్టి తెలిపారు. భవిష్యత్‌ సాంకేతికతలపై పెట్టుబడులను పెంచుతున్నామని, ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ ఆధారంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25-30 శాతం, లాభాలు 45-50 శాతం వరకు వృద్ధి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేసినట్లు సంస్థ సీఈఓ శశాంక్‌ వర్మ తెలిపారు.

Advertisement