Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూస్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో దీపావళికి ముందు కేంద్రం తన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. కేంద్ర పారామిలటరీ, సాయిధ బలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తించనుంది. ఈ ఆర్డర్‌ల కింద బోనస్ చెల్లింపు గరిష్ట పరిమితి రూ.7వేల నెలవారీ జీతం అని ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఉద్యోగులు గ్రూస్ సీ, డీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ ఏడాది బోనస్ పొందుతారని స్పష్టం చేసింది.
కరువు భత్యాన్ని 42శాతం నుంచి 46శాతానికి పెంచే అవకాశం
మార్చి 31, 2023 నాటికి సరీస్‌లో ఉండి, 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల పాటు నిరంతరాయంగా సర్వీస్ చేసిన ఉద్యోగులకు మాత్రమే చెల్లింపునకు అర్హులని పేర్కొంది. కనీసం ఆరు నెలల పాటు నిరంతర సేవలను అందించిన ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ కు అర్హులకి కేంద్రం వెల్లడించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ లో 4శాతం పెంపునకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ కరువు భత్యాన్ని ప్రస్తుతం 42 శాతం నుంచి 46శాతానికి పెంచే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో దీపావళికి కొన్ని వారాల ముందు కేబినేట్ అదనపు డీఏను 4శాతానికి పెంచిన విషయం తెలిసిందే.