
Tenure: ఈఎంఐ తగ్గాలంటే.. పర్సనల్ లోన్ కి ఎంత 'టెన్యూర్' ఉండాలో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. బ్యాంకులు ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్ మంజూరు చేస్తున్నాయి.
అవసరాలను తీర్చుకునేందుకు ప్రజలు ఈ రుణాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే పర్సనల్ లోన్ విషయంలో చాలామందిలో సందేహాలు ఉన్నాయి.
ముఖ్యంగా 'టెన్యూర్' ఎలాంటి ఉండాలి? అనే ప్రశ్న చాలా సాధారణం.
అధిక ఈఎంఐ భారం లేకుండా సరైన రుణ కాలవ్యవధి ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.
Details
1. ఈఎంఐ భారం తగ్గించుకోవాలంటే
పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ భారంగా అనిపిస్తే, రుణ కాలవ్యవధిని పెంచడం ఓ మంచి ఆప్షన్.
ఉదాహరణకు, మీరు రూ.5 లక్షల రుణాన్ని 11 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే, మూడేళ్లలో మాసిక వాయిదా రూ.23,304 చెల్లించాల్సి వస్తుంది.
మీరు ఈ భారాన్ని తగ్గించాలంటే రుణ కాలాన్ని పెంచి చూడవచ్చు.
నాలుగు సంవత్సరాలకు పెంచితే ఈఎంఐ రూ.16,369కి, ఐదేళ్లకు పెంచితే రూ.12,923 లేదా రూ.10,871కి తగ్గుతుంది.
Details
2. త్వరగా రుణం ముగించాలని అనుకుంటే
ఈఎంఐలు త్వరగా ముగించాలని భావిస్తే, చిన్న కాలవ్యవధిని ఎంచుకోవాలి.
ఉదాహరణకు, రూ.10 లక్షల రుణాన్ని నాలుగు సంవత్సరాలకు 11 శాతం వడ్డీతో తీసుకుంటే నెలవారీ వాయిదా సుమారు రూ.25,846 ఉంటుంది.
అదే రెండేళ్లకు కాలపరిమితి తీసుకుంటే, ఈఎంఐ రూ.46,608కి పెరుగుతుంది.
మరింత వేగంగా అంటే 18 నెలల్లోపు తిరిగి చెల్లించాలనుకుంటే, ఈఎంఐ రూ.60,634 వరకు చేరుతుంది.
Details
3. ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జీలు కూడా తెలుసుకోవాలి
మీరు ముందుగా రుణాన్ని పూర్తిగా చెల్లించాలని నిర్ణయించుకుంటే, బ్యాంకులు ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫీజు వసూలు చేస్తాయి.
ఉదాహరణకు, మీ రుణ టెన్యూర్ 3ఏళ్లు అయితే, మీరు రెండేళ్లలోపు రుణాన్ని ముగిస్తే, బ్యాంకు మిగిలిన అసలు మొత్తంపై ఒక శాతం ప్రీ-క్లోజర్ ఛార్జీ విధించవచ్చు.
దీనికి తోడు జీఎస్టీ చార్జీలు కూడా ఉంటాయి, వీటి శాతం 2 నుంచి 4 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.