LOADING...
Post Office: వడ్డీ తగ్గినా టెన్షన్‌ వద్దు.. పోస్టాఫీస్ స్కీమ్స్‌తో భారీ రాబడి 
వడ్డీ తగ్గినా టెన్షన్‌ వద్దు.. పోస్టాఫీస్ స్కీమ్స్‌తో భారీ రాబడి

Post Office: వడ్డీ తగ్గినా టెన్షన్‌ వద్దు.. పోస్టాఫీస్ స్కీమ్స్‌తో భారీ రాబడి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)తాజాగా రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ ఏడాది వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. ఈ నిర్ణయంతో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడే ఇన్వెస్టర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు కూడా తమ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇప్పటికే ప్రధాన బ్యాంకులు FD రేట్లను సవరిస్తుండటంతో, పొదుపు పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సురక్షితమైన, మంచి రాబడిని ఇచ్చే చిన్న పొదుపు పథకాలు సామాన్యులకు మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాలు ప్రస్తుతం బ్యాంక్ FDల కంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Details

పోస్టాఫీసు పథకాలు.. 7 శాతం పైగా రాబడి

పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి సవరించబడతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్ల ప్రకారం, చాలా పథకాలు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ప్రధాన పోస్టాఫీసు పథకాలు - వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ - 8.2 శాతం సుకన్య సమృద్ధి యోజన - 8.2 శాతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) - 7.7 శాతం కిసాన్ వికాస్ పత్ర - 7.5 శాతం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ - 7.5 శాతం పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ - 7.5 శాతం

Details

పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి కారణాలు

ప్రభుత్వ గ్యారెంటీ పోస్టాఫీసు పథకాలకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం భద్రతను కల్పిస్తుంది. అందువల్ల పెట్టుబడిపై నష్టపోయే ప్రమాదం ఉండదు. సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం 60 ఏళ్లు పైబడిన వారికి 8.2 శాతం వరకు వడ్డీ లభించడం వల్ల పదవీ విరమణ చేసిన వారికి ఇది స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుంది. స్థిరమైన రాబడి మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నా, ఈ పథకాల్లో వడ్డీ రాబడి స్థిరంగా ఉంటుంది.

Advertisement

Details

పన్ను ప్రయోజనాలు

NSC వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ FD రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో, గరిష్ట రాబడితో పాటు పూర్తి భద్రత కోరుకునే వారు పోస్టాఫీసు పొదుపు పథకాలను ఎంచుకోవడం ఉత్తమం. వడ్డీ రేట్లు మరింత తగ్గకముందే, మీ పెట్టుబడిని సురక్షితమైన మార్గాల్లో మళ్లించడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు.

Advertisement