Dr Agarwals Health Care: నిరాశపరిచిన డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ షేర్లు.. డిస్కౌంట్‌తో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ మాతృసంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ (Dr Agarwals Health Care) షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
అయితే, ఈ షేర్లు డిస్కౌంట్‌తో దలాల్ స్ట్రీట్‌లో ప్రవేశించి మదుపర్లను నిరాశపరిచాయి.
ఇష్యూ ధర రూ.402గా ఉండగా, బీఎస్‌ఈలో 1.27 శాతం తగ్గుదలతో రూ.396 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జనవరి 29న ప్రారంభమై 31న ముగిసింది. కంపెనీ ధర శ్రేణిని రూ.382-402గా నిర్ణయించింది.
గరిష్ఠ ధర వద్ద, కంపెనీ మొత్తం రూ.3,027.26 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
1.55 రెట్ల సబ్‌స్క్రిప్షన్
ఐపీఓలో భాగంగా, రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,727.26 కోట్ల షేర్లు జారీ చేసింది.
రిటైల్ మదుపర్లు ఒక్క లాట్ (35 షేర్లు) కోసం రూ.14,070 వెచ్చించారు.
ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం 1.55 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.
అయితే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత షేరు రాణించలేకపోయింది.
ప్రారంభంలోనే డిస్కౌంట్‌తో లిస్ట్ అయిన ఈ షేర్లు ఇంకా దిగజారాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఈ షేరు రూ.371.95 వద్ద ట్రేడవుతోంది.