Page Loader
బైజూస్‌ కు టైమ్ లేదు.. 40 మిలియన్ డాలర్ల భారీ వడ్డీ భారం
నేడే లాస్ట్ డేట్

బైజూస్‌ కు టైమ్ లేదు.. 40 మిలియన్ డాలర్ల భారీ వడ్డీ భారం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 05, 2023
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెకీ మహానగరం బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్‌ కి గడ్డు కాలం నెలకొంది. ఈ మేరకు వడ్డీ చెల్లించేందుకు నేడే అఖరి అవకాశం కాగా అందుకు వడ్డీ కట్టేందుకు సంస్థ సమాయత్తమవుతోందని సమాచారం. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా సుమారు 40 మిలియన్‌ డాలర్ల మేర భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంది. జూన్‌ 5 తుది గడువును బేస్ చేసుకుని సకాలంలో వడ్డీ చెల్లించేందుకు కంపెనీ ఏర్పాట్లలో నిమగ్నమైన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ 40 మిలియన్‌ డాలర్ల వడ్డీని బైజూస్ సకాలంలో చెల్లించకపోతే, 1.2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఎగవేసినట్టుగా చెడు పేరు మూటగట్టుకుంటారు. ఈ అంశంపై బైజూస్‌ నుంచి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం కొసమెరుపు.

 byjus faces deadline for 40 million payment today

కొవిడ్ వల్లే రుణ చెల్లింపులు డైలమాలో పడ్డాయి

కొవిడ్ కాలంలో బైజూస్‌ తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. అయితే అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫలితంగా బైజూస్ ఆదాయం ఆకస్మికంగా డమాల్ అంటూ దిగజారింది. ఈ కారణంగా రుణాల చెల్లింపులు డైలమాలో పడ్డాయి. ఫలితంగా బైజూస్‌.. రుణదాతల బృందంతో చర్చలు చేసింది. లోన్ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతివ్వాలని అభ్యర్థించింది. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల మధ్య ఒప్పందం ఏమీ కుదరలేదు. ప్రస్తుతం 40 మిలియన్‌ డాలర్ల వడ్డీని సకాలంలో కడితేనే, మరింత మూలధన సమీకరణకు బైజూస్ కు అవకాశం కలుగుతుంది. తద్వారా కార్యకలాపాలను యధావిథిగా కొనసాగించేందుకు వీలుంటుంది. లేని పక్షంలో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదురు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.