
Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భద్రతాపరమైన ఫీచర్లలో ముఖ్యమైన బ్లాక్ ఫీచర్ ను తొలగించడం వల్ల ఆన్‌లైన్ వేధింపులు పెరిగే ఛాన్స్ ఉందని యూజర్లు వాపోతున్నారు.
ఓ యూజర్ బ్లాక్ ఫీచర్ గురించి అడిగిన ప్రశ్నకు మస్క్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఎక్స్ ప్లాట్ ఫాంలో బ్లాక్ ఫీచర్ ను తొలగిస్తున్నామని, త్వరలోనే ఈ ఫీచర్ ను డిలీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Details
మండిపడుతున్న యూజర్లు
ఇకపై ఎక్స్ లో బ్లాక్ ఫీచర్ కు బదులుగా మ్యూట్ ఫీచర్ ని వినియోగించవచ్చు. మనం ఏదైనా ఖాతాను మ్యూట్ చేస్తే ఆ ఖాతాదారు చేసే పోస్టుల్ని మనం వీక్షించకుండా ఉండేందుకు వీలుంటుంది.
అయితే మనం చేసే పోస్టులు మ్యూట్ చేసిన వ్యక్తి మాత్రం చూసే అవకాశం ఉంటుంది. ఆ పోస్టులను తన ఫాలోవర్లకు రీపోస్ట్ కూడా చేయొచ్చు.
ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని యూజర్లు ఆరోపిస్తున్నారు.
ఎక్స్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ అనేక మార్పులను తీసుకొచ్చారు. మొదట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించడం నుంచి ట్విట్టర్ ను ఎక్స్‌గా మార్చడం వరకూ అనేక నిర్ణయాలను తీసుకున్నారు.