LOADING...
Elon Musk: రూ.15 లక్షల కోట్ల వేతన ప్యాకేజీతో ఎలాన్ మస్క్ సంచలనం
రూ.15 లక్షల కోట్ల వేతన ప్యాకేజీతో ఎలాన్ మస్క్ సంచలనం

Elon Musk: రూ.15 లక్షల కోట్ల వేతన ప్యాకేజీతో ఎలాన్ మస్క్ సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌కు ఏకంగా 158 బిలియన్‌ డాలర్ల పారితోషిక ప్యాకేజీని టెస్లా ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే ఈ మొత్తం నేరుగా మస్క్ ఖాతాలో జమవుతుందనుకోవడం తప్పు. దీనికి కొన్ని కీలక షరతులు వర్తించనున్నాయి. సాధారణంగా టెస్లా సీఈఓగా మస్క్ నెలవారీ జీతం తీసుకోరు. ఆయనకు స్టాక్ అవార్డులు, ఇతర ప్రోత్సాహకాల రూపంలోనే పారితోషికం అందుతుంది. 2025 సంవత్సరానికి ప్రకటించిన 158 బిలియన్ డాలర్ల ప్యాకేజీ. వాస్తవంగా ఆయన పొందే మొత్తం ప్రకటనలో ఉన్నదానికంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

వివరాలు

గతేడాది కూడా భారీ ప్యాకేజీ

ఈ ప్యాకేజీలో ప్రధాన భాగం పనితీరు ఆధారితమే. ఇందులో 132 బిలియన్ డాలర్లు కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నప్పుడే లభిస్తాయి. మిగిలిన 26 బిలియన్ డాలర్లు టెస్లా బోర్డు ఆమోదించిన మధ్యంతర అవార్డు రూపంలో ఇవ్వనున్నారు. గతేడాది కూడా మస్క్‌కు భారీ ప్యాకేజీని టెస్లా ప్రకటించింది. అయితే అది పూర్తిగా ఈక్విటీ అవార్డుల రూపంలో ఉండగా, కంపెనీ స్టాక్ విలువ పెరగడం, నిర్ణయించిన వ్యాపార లక్ష్యాలు సాధించడం వంటి షరతులు నెరవేరాల్సి ఉంది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టెస్లా మార్కెట్ విలువ పెరగకపోవడంతో పాటు లక్ష్యాలు కూడా చేరుకోలేకపోయింది. దీంతో మస్క్‌కు ఎలాంటి పారితోషికం అందలేదు.

Advertisement