
Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ?
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉన్నట్లు ఉన్నారు. కంపెనీ విడుదల చేసిన పత్రాల ప్రకారం, టెస్లా అనుకున్న లక్ష్యాలను సాఫీగా చేరినట్లయితే,షేర్ల బదిలీ ద్వారా మస్క్‌కు ఈ భారీ ప్యాకేజీ లభిస్తుంది. ఇందుకు కొన్ని ముఖ్య షరతులు ఉన్నాయి: వచ్చే పదేళ్లలో కంపెనీ విలువను ప్రస్తుత లక్ష కోట్ల డాలర్ల నుంచి 8 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలి. షరతులు చేరితే 12% షేర్లు మస్క్‌కు బదిలీ అవుతాయి. ఈ షేర్లను విక్రయించుకోవడానికి మస్క్ కనీసం ఏడున్నరేళ్ల పాటు కంపెనీతో కొనసాగాలి. మొత్తం మొత్తాన్ని పొందాలంటే, మస్క్ 10 ఏళ్లు టెస్లా కంపెనీలో కొనసాగాలి.
Details
భారతదేశంలో టెస్లా తొలి కారు డెలివరీ
ముంబైలో అమెరికా విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా తన కార్ల డెలివరీని ప్రారంభించింది. ముంబై షోరూం నుంచి 'మోడల్ వై' తొలి కారును మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ శుక్రవారం స్వీకరించారు. ఆయన తన మనవడికి ఈ కారును బహుమతిగా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.