
EPFO: జనన రుజువుగా ఆధార్‌ను తొలగించిన ఈపీఎఫ్ఓ
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులు బర్త్ సర్టిఫికెట్ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్నితీసుకున్నట్లు తెలిపింది.
మంగళవారం సర్క్యులర్ ద్వారా తెలియజేయబడిన ఈ నిర్ణయం సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ (CPFC) నుండి ఆమోదం పొందింది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాలను అనుసరిస్తుంది.
UIDAI ఆదేశం ప్రకారం ఆధార్ కార్డును ప్రాథమిక ధ్రువీకరణ డాక్యుమెంట్ గా మాత్రమే పరిగణించాలని అంతేకాని బర్త్ సర్టిఫికెట్ ప్రామాణికం కాదని ఈపీఎఫ్‌వో జనవరి 16న సర్క్యులర్ విడుదల చేసింది.
ఈపీఎఫ్ఓ దాని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చుకుంటుంది.
Details
అన్ని జోనల్,ప్రాంతీయ కార్యాలయాలకు సర్క్యులర్
అవసరమైన మార్పులు చేయడానికి అంతర్గత సిస్టమ్ విభాగం (ISD) బాధ్యత వహిస్తుంది.
ఈ తాజా మార్గదర్శకాలను విస్తృతంగా అమలు చేసేలా EPFO అన్ని జోనల్,ప్రాంతీయ కార్యాలయాలకు సర్క్యులర్ నిర్దేశిస్తుంది.
బాంబే హైకోర్టుతో సహా ఇటీవలి కోర్టు తీర్పులు ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించరాదనే అభిప్రాయానికి మద్దతు ఇచ్చాయి.
EPFO కోసం, కింది పత్రాలు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా పరిగణించబడతాయి:
ప్రభుత్వ గుర్తింపుపొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా
Details
EPFO కోసం, కింది పత్రాలు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా పరిగణించబడతాయి:
స్కూల్ ట్రాన్స్‌ఫర్ (SLC) లేదా స్కూల్ లీవింగ్ (TC) సర్టిఫికెట్
ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ (వాటిపై పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే..)
సర్వీస్ రికార్డు ఆధారంగా జారీ చేసిన సర్టిఫికెట్
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ సర్టిఫికెట్
ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం
పాన్ కార్డు, పాస్‌పోర్టు, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్