LOADING...
EPFO: పీఎఫ్ వడ్డీ జమైందా? మిస్డ్ కాల్‌తోనే బ్యాలెన్స్ చెక్ చేసే సులభ మార్గాలు ఇవే!
పీఎఫ్ వడ్డీ జమైందా? మిస్డ్ కాల్‌తోనే బ్యాలెన్స్ చెక్ చేసే సులభ మార్గాలు ఇవే!

EPFO: పీఎఫ్ వడ్డీ జమైందా? మిస్డ్ కాల్‌తోనే బ్యాలెన్స్ చెక్ చేసే సులభ మార్గాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం అమలు చేస్తున్న ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తోంది. ఉద్యోగులు పనిచేసే కాలంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపుగా జమ చేసి, రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధులు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే కాలక్రమేణా నిబంధనల్లో మార్పులు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో కూడా అవసరమైన మేరకు డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

వివరాలు 

ఉద్యోగి ప్రాథమిక వేతనం, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది

ప్రైవేట్ రంగంలో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ పథకం వర్తిస్తుంది. ఉద్యోగులకు యాజమాన్యం తప్పనిసరిగా పీఎఫ్ ఖాతా తెరవాలి. ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక వేతనం, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే యాజమాన్యం చెల్లించే మొత్తంలో కొంత భాగం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు, మిగతా భాగం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఈపీఎస్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత అర్హతలను బట్టి నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు 

పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ

ఈపీఎఫ్ ఖాతాల్లో జమయ్యే మొత్తంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ప్రకటిస్తుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఈ వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే వడ్డీ జమ ప్రక్రియ కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే వడ్డీ పడిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా పీఎఫ్ బ్యాలెన్స్‌ను పరిశీలించాలి.

Advertisement

వివరాలు 

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు నాలుగు మార్గాలు

పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం, ప్రతి నెలా కంపెనీ చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్, వడ్డీ జమ వంటి వివరాలను సభ్యులు నాలుగు రకాలుగా తెలుసుకోవచ్చు. అవి.. అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్ ఉమంగ్ యాప్ ఎస్ఎంఎస్ సర్వీస్ మిస్డ్ కాల్ సర్వీస్ ఈ సేవల ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వల్ల కంపెనీ సక్రమంగా పీఎఫ్ చెల్లిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.

Advertisement

వివరాలు 

SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి?

ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు మెసేజ్ పంపాలి. ఇక్కడ UAN స్థానంలో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ నమోదు చేయాలి. అలాగే అవసరమైన భాష కోసం UAN తర్వాత స్పేస్ ఇచ్చి TEL, ENG వంటి లాంగ్వేజ్ కోడ్ నమోదు చేస్తే ఆ భాషలో వివరాలు అందుతాయి.

వివరాలు 

ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ వివరాలు

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అనంతరం EPFO సెక్షన్‌లోకి వెళ్లి Employee Centric Services ఎంపిక చేసుకోవాలి. అక్కడ Track Claim లేదా సంబంధిత సేవను ఎంచుకుని UAN నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అయితే పీఎఫ్ బ్యాలెన్స్, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవడానికి మిస్డ్ కాల్ సర్వీస్ అత్యంత సులభమైన మార్గం. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు లేదా మూడు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

వివరాలు 

అధికారిక వెబ్‌సైట్ ద్వారా బ్యాలెన్స్ చెక్

అనంతరం మీ మొబైల్‌కు SMS రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్, చివరిసారిగా జమ అయిన కాంట్రిబ్యూషన్ వంటి వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ఓ అధికారిక సభ్యుల పోర్టల్‌లో UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. తర్వాత Services విభాగంలో For Employees ఆప్షన్‌ను ఎంచుకుని Passbook సేవపై క్లిక్ చేయాలి. అక్కడ ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ జమలు, బ్యాలెన్స్, వడ్డీ క్రెడిట్ వివరాలను పూర్తిగా చూడొచ్చు.

వివరాలు 

వడ్డీ ఆలస్యంగా జమైతే నష్టమా?

ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత పీఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ చేపట్టినా,అది నిర్దిష్ట తేదీకే పూర్తవుతుందనే నిబంధన లేదు. కొన్నిసార్లు జమ కావడంలో ఆలస్యం జరిగినా సభ్యులకు ఎలాంటి నష్టం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేస్తోంది. వడ్డీ ఎప్పుడు జమ చేసినా పూర్తి మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లోనే క్రెడిట్ చేస్తామని చెబుతోంది. కాబట్టి వడ్డీ ఇంకా పడలేదని పీఎఫ్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Advertisement