Page Loader
IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం 
ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం

IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత దశాబ్దంతో పోలిస్తే విమానయాన వ్యయాలు వాస్తవంగా 40 శాతం తక్కువయ్యాయని, ఇది భారీ ఖర్చులు, పన్నుల ఒత్తిడుల మధ్య సాధ్యమైందని అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) డైరెక్టర్ జనరల్ విలీ వాల్ష్ తెలిపారు. భారతదేశంలో 42 ఏళ్ల తర్వాత జరుగుతున్న IATA వార్షిక సర్వసభ్య సమావేశంలో విలీ వాల్ష్ మాట్లాడుతూ, ఈ ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య 5 బిలియన్ మార్కును దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Details

విమానయాన రంగ వృద్ధి మందగమనం

ప్రస్తుతం విమానయాన రంగం వృద్ధి రేటు కొంత మందగించింది. దీనికి ప్రధాన కారణం విమాన తయారీ రంగంలో తలెత్తిన సరఫరా వ్యవస్థ సమస్యలేనని విలీ వాల్ష్ స్పష్టం చేశారు. 2025లో జరగాల్సిన డెలివరీలలో 26 శాతం కోత విధించబడిందని, ప్రస్తుతం 17,000 ఆర్డర్లు పెండింగ్‌లో ఉండటంతో కొత్తగా ఆర్డర్ చేస్తే కనీసం 14 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లాభాలపై గణాంకాలు IATA తాజా అంచనాల ప్రకారం విమానయాన రంగం ఆదాయం : 979 బిలియన్ డాలర్లు నికర లాభం : 36 బిలియన్ డాలర్లు ప్రతి ప్రయాణికుడిపై నికర లాభం : 7.20 డాలర్లు నికర లాభ మార్జిన్ : 3.7%

Details

ఇండియాలో వేగంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు 

మేము సృష్టిస్తున్న విలువతో పోలిస్తే మా లాభదాయకత చాలా తక్కువ అని వాల్ష్ అన్నారు. విమానయాన రంగం ప్రపంచ GDPలో 3.9 శాతాన్ని, 8.65 కోట్ల ఉద్యోగాలను ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటిగా మారిందని, ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోందని వాల్ష్ పేర్కొన్నారు. అయితే టికెట్ల ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన ఉంది చట్టాలు, నిబంధనల వల్ల వస్తున్న ఇబ్బందులు చట్టాలు విమానయాన రంగానికి మరింత ముప్పుగా మారుతున్నాయని, సరైన ఖర్చు-లాభాల విశ్లేషణ లేకుండా తెగదెంపులు చేస్తున్నారని అన్నారు. 'రెగ్యులేటర్లు తమ సొంత డబ్బుతో ఆడటం లేదు కాబట్టి బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.

Details

భద్రతా అంశాల్లో లోపాలు

2023లో మొత్తం 40.6 మిలియన్ విమానాల ప్రయాణాల్లో 7 ఘోర ప్రమాదాల్లో 244 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక నావిగేషన్ వ్యవస్థల్లో అంతరాయాలు అధికమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ఎయిరోస్పేస్ పరిశ్రమను రాజకీయ తగాదాల నుంచి దూరంగా ఉంచాలని వాల్ష్ అభిప్రాయపడ్డారు.