LOADING...
సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలం; కోర్టులో దావా
సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలం; కోర్టులో దావా

సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలం; కోర్టులో దావా

వ్రాసిన వారు Stalin
Mar 22, 2023
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక దోపిడీని అరికట్టడంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, దాని యంత్రాంగం విఫలమయ్యారని అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో దావా దాఖలైంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ అయిన మెటా స్టాక్‌ను కలిగి ఉన్న 'పెన్షన్, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్' కోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లైంగిక దోపిడీ జరగకుండా మెటా చూసీచూడనట్లు వ్యవహరించినట్లు పిటిషనర్ వ్యాజ్యంలో ఆరోపణలు చేశారు.

మెటా

వ్యాజ్యంలో పేర్కొన్న ఆరోపణలను ఖండించిన మెటా

జుకర్‌బర్గ్ కూడా పిల్లల లైంగిక దోపిడీ అనేది కంపెనీ ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో ఒకటి అని గతంలో అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించడానికి మెటా అనేక చర్యలను చేపట్టింది. అయితే ఆ సమస్య అపరిష్కృతంగానే ఉంది. సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించడంలో మెటా బోర్డు విఫలమైనట్లు పిటిషనర్ ఆరోపించారు. డెలావేర్ ఛాన్సరీ కోర్టులో దాఖలైన పిటిషన్‌లోని ఆరోపణలను మెటా కంపెనీ తోసిపుచ్చింది. తప్పుడు ఆలోచనలో ఉన్నవారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా, ఇతరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడమే తమ లక్ష్యం అని మెటా ప్రకటించింది.